Site icon NTV Telugu

పవన్ కోసం దిల్ రాజు వెనకడుగు.. “ఎఫ్3” రిలీజ్ వాయిదా

F3

2022 సంక్రాంతి క్లాష్ కు చెక్ పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ తరువాత ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు కూడా పవన్ కోసం వెనకడుగు వేయక తప్పలేదు. ‘భీమ్లా నాయక్’ కోసం తన సినిమా విడుదల తేదీని త్యాగం చేసేశారు దిల్ రాజు. ‘భీమ్లా నాయక్’తో పాటు ‘ఎఫ్3’ కూడా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన “ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” ఇప్పుడు ఏప్రిల్ 29కి వాయిదా పడింది. అదే విషయాన్ని ప్రకటిస్తూ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ లో సినిమా కొత్త విడుదల తేదీని వెల్లడించారు.

Read Also :

https://ntvtelugu.com/producers-press-meet-about-sankranthi-movies/

దిల్ రాజు మాట్లాడుతూ, “భీమ్లా నాయక్ విడుదల కోసం మేము మా ‘ఎఫ్ 3’ చిత్రం విడుదలను ఫిబ్రవరి 25 నుండి వాయిదా వేశాము. ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1న, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమయ్యాయి. కాబట్టి ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నాము” అని ప్రకటించారు. అలాగే జనవరి 12న విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా జనవరి 25కి వాయిదా పడింది. సినిమా పరిశ్రమకు భయంకరమైన కరోనా మహమ్మారి సమయం తరువాత ఈ బాక్స్ ఆఫీస్ వార్ మంచిది కాదని అన్నారు దిల్ రాజు. అభిమానులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు, స్రవంతి రవికిషోర్, యువి వంశీ, దానయ్య, దాము పాల్గొన్నారు.

Read Also :

https://ntvtelugu.com/pawan-kalyans-bheemla-nayak-postponed/

కాగా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, తమన్నా, వరుణ్ తేజ్, వెంకటేష్ దగ్గుబాటి, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీలో రెండవ విడతగా వస్తున్న ‘ఎఫ్ 3″లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా మొదటి భాగంలోని పాత్రలను కంటిన్యూ చేస్తున్నారు.

Exit mobile version