విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసిన ‘ఎఫ్3’ బృందం మే 27న థియేటర్లలోకి రానున్నట్టుగా వెల్లడించారు. “పిల్లలు పరీక్షలు ముగించుకోండి… పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి… ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!” అంటూ అందరి దృష్టిని ఆకట్టుకునేలా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
Read Also : Music ‘N’ Play : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రతో పాట… ఆట… అదుర్స్!!
వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించారు. కానీ రాబోయే భారీ సినిమాల విడుదల తేదీలపై ఇంకా అనిశ్చితి నెలకొంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం జారీ చేసే కొత్త GO పై సస్పెన్స్ నెలకొంది. టాలీవుడ్ మొత్తం ఇప్పుడు కొత్త జీవో కోసమే ఎదురు చూస్తోంది. ఇక మూడవ వేవ్ ముగుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని తొలగించి ఈ వారం కొత్తం మార్గదర్శకాలు నిర్దేశించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన పరీక్షలు మే మధ్య నాటికి పూర్తవుతాయి. కాబట్టి వేసవి సెలవుల సమయంలో థియేటర్లలో వేసవి సోగ్గాళ్ల వినోదం, ఫన్ పిక్నిక్ మొదలవుతుందన్న మాట.
