NTV Telugu Site icon

Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Salaar Overseas Rights

Salaar Overseas Rights

Eye Popping Price Offered For Salaar Overseas Rights: భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’తో సరికొత్త సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్ కోసం యావత్ భారతీయులతో పాటు ఓవర్సీస్‌లో ఉన్న ఇండియన్స్ కూడా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు థియేటర్లపై దండయాత్ర చేద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. ఎటు చూసినా.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఈ రేంజ్‌లో క్రేజ్ ఉంది కాబట్టే.. ఈ ప్రాజెక్ట్ హక్కులు కనీవినీ ఎరుగని స్థాయిలో అమ్ముడుతుపోతున్నాయని సమాచారం.

Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సలార్ ఓవర్సీస్ హక్కులను ఏకంగా రూ.100 కోట్లకు సొంతం చేసుకుందట. ఇది నిజంగా అతిపెద్ద అమౌంట్. ఇంతవరకు ఏ సౌంత్ ఇండియన్ సినిమా.. ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి.. ‘సలార్’కి ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓవర్సీస్‌లోనే కాదండోయ్.. ఇండియన్ సినీ పరిశ్రమలోనూ ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఉందని, ఊహించిన దానికంటే ఎక్కువ ఆఫర్లే వస్తున్నాయని తెలుస్తోంది. చూస్తుంటే.. ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా రూ.500 కోట్ల మార్కెట్‌ని దాటేసేలా ఉంది. ఒక్క కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనే.. ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారని తెలిసింది.

Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్

ఇకపోతే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, జగపతి బాబు సైతం ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తన హోంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.

Show comments