NTV Telugu Site icon

AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..

Alluarjun

Alluarjun

పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్‌లో ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప-2. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు బన్నీ. గతంలోనే ఈ సినిమా ప్రకటించగా ఇప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్‌కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

Also Read : Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై

ఈ నెలాఖరు నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీని కంటే ముందు అల్లు అర్జున్ నయా లుక్‌తో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని సమాచారం. గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హిట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. మైథలాజికల్ టచ్‌తో భారీ బడ్జెట్‌ సినిమాకు రెడీ అవుతున్నారు. బన్నీ పుష్ప2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో త్రివిక్రమ్ బన్నీ ఎలా చూపించబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎదురు చుస్తున్నారు. ఈ సినిమా అనాన్స్ మెంట్ ఎప్పుడు వచ్చినా సరే  ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.