టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సింగర్ నోయల్ ని వివాహమాడి వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొన్నేళ్ళకే విబేధాల వలన భర్తకు విడాకులిచ్చి బయటికొచ్చేసింది. ఇక విడాకుల తరువాత 69 సంస్కార్ కాలనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుంచి సినిమాపై వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పెళ్లి అయిన మహిళ తన ఇంటిపైనే అద్దెకుండే కుర్రాడితో సాగించిన రొమాన్స్ నే కథగా చూపించారు. దీంతో పెళ్లైన మహిళలను కించపరుస్తున్నారు.. ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వార్తలపై ఎస్తేర్ మాట్లాడుతూ” మగవారికి మాత్రమే కాదు ఆడవారికి ఆ కోరికలు ఉంటాయి. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు హీరోలను ఎలాంటి ప్రశ్నలు అసాగారు.. అదే హీరోయిన్ కొంచెం ఘాటుగా ఉన్న పాత్రలు చేస్తే మాత్రం .. ఇలాంటి పాత్ర ఎలా చేసావ్.. కనీసం సిగ్గు కూడా ఉండదా అంటూ తిట్టిపోస్తారు. మగవారికి, ఆడవారికి తేడా ఏంటీ.. మగ వాళ్లకు మాదిరిగానే ఆడవాళ్లకు కూడా సమానమైన హక్కులు కల్పిస్తున్నామని చెబుతూనే ఆడ వారిని చిన్నచూపు చూసేందుకు సమాజం ఎప్పుడు ముందే ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మార్చి 18 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
