Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మరో డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని మాధురి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
మాధురి రాథోడ్ ఫిర్యాదు ప్రకారం.. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపించింది. అయితే ఆ తర్వాత తనను మోసం చేశాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఈశ్వర్ సాయిపై BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా ఈశ్వర్ సాయి వ్యవహరించాడని కూడా మాధురి ఆరోపించారు. తన ఫోన్లో ఉన్న వీడియోలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అక్రమ సంబంధాలు ఉన్నట్లు చూపించేలా ఏఐ వీడియోలు సృష్టించారని ఆమె వాపోయారు.
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ఇక ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఓ హోటల్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆయన భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. అయితే ఆ సమయంలో తన తప్పేమీ లేదంటూ ఈశ్వర్ సాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా మాధూరి రాథోడ్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మాధురి రాథోడ్ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోన్ డేటా, వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!