Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awarapan 2: బాక్సాఫీస్ వద్ద ఈసారి ఇమ్రాన్ హష్మీ పేరు గట్టిగా వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయనకు భారీ విజయాన్ని అందించిన ‘ఆవారాపన్ 2’ రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించింది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ మంచి స్పందన రావడంతో సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ‘ఆవారాపన్ 2’ విడుదలైన రోజే రూ.22 కోట్లతో బలమైన ఓపెనింగ్ సాధించింది. ఆ తర్వాత కూడా సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మంగళవారం వచ్చిన కలెక్షన్లతో ఈ చిత్రం కీలక మైలురాయిని అందుకుంది. ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ అంచనాల ప్రకారం, ఐదో రోజు మంగళవారం ఈ సినిమా రూ.9.75 కోట్లు వసూలు చేసింది. దీంతో దేశీయ నెట్ కలెక్షన్లు రూ.100.75 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ గ్రాస్ వసూళ్లు రూ.120.33 కోట్లను దాటినట్లు సమాచారం.
దేశీయ మార్కెట్లోనే కాదు, విదేశాల్లో కూడా ‘ఆవారాపన్ 2’కు మంచి ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఐదు రోజుల్లోనే రూ.23.80 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.144.13 కోట్లకు చేరుకున్నాయి. ఈ వేగం చూస్తే ఇమ్రాన్ హష్మీ కెరీర్లో ఇది అత్యంత వేగంగా వసూళ్లు సాధిస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సమయంలో సన్నీ డియోల్ నటించిన ‘బట్వారా 1947’ కూడా థియేటర్లలో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అయితే వసూళ్ల పరంగా ‘అవరాపన్ 2’ స్పష్టమైన ఆధిపత్యం చాటుతోంది. తొలి ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల మైలురాయి చేరుకోవడం సినిమాకు ఉన్న ప్రేక్షకాదరణను తెలుస్తోంది. అయితే ఇప్పుడు ‘ఆవారాపన్ 2’కు మరో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. మరో కొన్ని రోజుల్లో యష్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ థియేటర్లలోకి రానుంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆవారాపన్ 2కి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, తొలి వారంలోనే బలమైన వసూళ్లతో దూసుకెళ్లిన ‘అవరాపన్ 2’ ఇప్పటికే హిట్ రన్‌ను నమోదు చేసింది.
Also Read
- Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
- Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
‘ఆవారాపన్ 2’ 2007లో విడుదలైన బాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆవారాపన్’ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రం 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 14 ఆగస్టు 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ (శివమ్ పండిట్ పాత్రలో), దిశా పటానీ, షబానా అజ్మీ ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే, మొదటి భాగంలో జరిగిన కాల్పుల నుండి ప్రాణాలతో బయటపడిన శివమ్, తన పాత జ్ఞాపకాలతో ఒంటరిగా గడుపుతుంటాడు. కానీ ఒక మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కుకున్న అమాయక పిల్లలను రక్షించడానికి అతను మళ్లీ ఆయుధం పట్టాల్సి వస్తుంది. మిథూన్ అందించిన అద్భుతమైన మెలోడీ సాంగ్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రెండు రోజుల్లోనే దాదాపు ₹50 కోట్ల వసూళ్లను సాధించి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం దేశీయంగా రూ.100.75 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.144.13 కోట్ల గ్రాస్ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తుందా, లేక ‘టాక్సిక్’ ఎంట్రీతో వసూళ్లపై ప్రభావం పడుతుందా అన్నది చూడాలి.
- Tags
- Awarapan 2
- cinema
తాజావార్తలు
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!