The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Emraan Era: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నిన్న రాత్రి (సెప్టెంబర్ 5న) హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ‘క్వేక్ అరేనా’ (Quake Arena) లో జరిగిన ‘ది ఇమ్రాన్ ఎరా’ (The Emraan Era) లైవ్ ఈవెంట్లో డీజే బూత్‌పైకి ఎక్కి అభిమానులను ఓ రేంజ్లో ఊపేశారు. దాదాపు 20ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇలా లైవ్ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో ఇమ్రాన్ హష్మీ మేనియా స్పష్టంగా కనిపించింది. డీజే గణేష్ తో కలిసి ఆయన వేదికను పంచుకోగా, థియేటర్లలో భారీ సక్సెస్ సాధించిన ‘ఆవారాపన్ 2’ హిట్ తరువాత జరిగిన ఈ కచేరీకి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే ఐకానిక్ హిట్స్‌గా నిలిచిన మర్డర్, ఆషిక్ బనాయా ఆప్నే, జన్నత్, ఆవారాపన్ సినిమాలలోని క్లాసిక్ సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు ఆయన స్వయంగా డీజే బూత్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ, క్రౌడ్‌ను ఉర్రూతలూగించారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్లాన్ చేసిన ఈ రెండు ప్రత్యేక లైవ్ షోల కోసం ఇమ్రాన్ హష్మీ ఏకంగా రూ. 2 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంతకుముందు బెంగళూరులో ఆగస్టు 29న జరగాల్సిన కచేరీ ఇమ్రాన్ అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 12కు వాయిదా పడటంతో, హైదరాబాద్ ఈవెంట్ కూడా ఎక్కడ రద్దవుతుందోనని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ నిన్న రాత్రి ఆయన ఎనర్జిటిక్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ఆటంకం లేకుండా షోను సక్సెస్ చేయడంతో హైదరాబాద్ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అయ్యారు. హైదరాబాద్ నైట్‌లైఫ్‌లో నిన్న రాత్రి జరిగిన ‘ది ఇమ్రాన్ ఎరా’ ఈవెంట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
- December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
- Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
- Tags
- cinema
- Emraan Hashmi
తాజావార్తలు
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!