Site icon NTV Telugu

పునీత్‌కి డబ్బింగ్… శివరాజ్‌ కుమార్‌ ఎమోషనల్

Sivaraj Kumar

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ “జేమ్స్” విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేకపోవడంతో ఆయన పాత్ర డబ్బింగ్ విషయం ఆసక్తికరంగా మారింది. పునీత్ డబ్బింగ్ మినహా సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పునీత్‌కి డబ్బింగ్ చెప్పడానికి తగిన వాయిస్‌ కోసం మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపారు.

Read Also : వి వాంట్ “భీమ్లా నాయక్” అప్డేట్

అయితే తన సోదరుడికి డబ్బింగ్ చెప్పాలంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నానని స్టార్ నటుడు చెప్పాడు. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో శివన్న మాట్లాడుతూ తాను కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించానని, అయితే ఆ పని చేస్తున్నప్పుడు పునీత్‌ను స్క్రీన్‌పై చూడటం తనకు మానసికంగా సవాలుగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. పునీత్‌కి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నమైతే చేస్తున్నాను… కానీ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియడం లేదని అన్నారు.

పునీత్‌కి డబ్బింగ్ చెప్పడంతో పాటు ‘జేమ్స్‌’లో శివన్న అతిధి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో పునీత్ మరో సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా చిన్న పాత్రలో నటించారు. కర్నాటక మొత్తం ‘జేమ్స్‌’ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పునీత్ కు ఈ సినిమాతో ఘన నివాళి అర్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక మొత్తంలో మార్చి 17 నుంచి వారం రోజుల పాటు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాదు.

Exit mobile version