పునీత్‌కి డబ్బింగ్… శివరాజ్ కుమార్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ “జేమ్స్” విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేకపోవడంతో ఆయన పాత్ర డబ్బింగ్ విషయం ఆసక్తికరంగా మారింది. పునీత్ డబ్బింగ్ మినహా సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పునీత్‌కి డబ్బింగ్ చెప్పడానికి తగిన వాయిస్ కోసం మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపారు.
Read Also : వి వాంట్ “భీమ్లా నాయక్” అప్డేట్
Also Read
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
అయితే తన సోదరుడికి డబ్బింగ్ చెప్పాలంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నానని స్టార్ నటుడు చెప్పాడు. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో శివన్న మాట్లాడుతూ తాను కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించానని, అయితే ఆ పని చేస్తున్నప్పుడు పునీత్‌ను స్క్రీన్‌పై చూడటం తనకు మానసికంగా సవాలుగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. పునీత్‌కి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నమైతే చేస్తున్నాను… కానీ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియడం లేదని అన్నారు.
పునీత్‌కి డబ్బింగ్ చెప్పడంతో పాటు ‘జేమ్స్’లో శివన్న అతిధి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో పునీత్ మరో సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా చిన్న పాత్రలో నటించారు. కర్నాటక మొత్తం ‘జేమ్స్’ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పునీత్ కు ఈ సినిమాతో ఘన నివాళి అర్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక మొత్తంలో మార్చి 17 నుంచి వారం రోజుల పాటు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాదు.
తాజావార్తలు
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!