Devil: కళ్యాణ్ రామ్ స్పై ‘డెవిల్’ కోసం మరో బాలీవుడ్ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elnaaz Norouzi as Rosy in Nandamuri Kalyan Ram’s Spy Thriller Devil:’నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచి విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. రీసెంట్గా రిలీజైన డెవిల్ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రాగా నవంబర్ 24న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఇటీవల మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ ఎల్నాజ్ నోరౌజీ పాత్రను పరిచయం చేస్తూ ఆమెను రంగంలోకి దించారు. ఈ సినిమాలో ఆమె రోజీ అనే పాత్రలో అలరించనుంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ ఎల్నాజ్ నోరౌజీ మా డెవిల్ చిత్రంలో రోజీ పాత్రలో అలరించనుంది, ఆమె సిల్వర్ స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పిస్తుంది, ఆమె ఈ చిత్రంలో తనదైన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనతో ఆకట్టుకోనుంది, దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్ పోస్టర్ సాక్ష్యం అంటూ మేకర్స్ ట్వీట్ చేస్తూ ప్రకటించారు.
Chandramukhi 2: చంద్రముఖి ఇంటికే వచ్చేస్తోంది.. గెట్ రెడీ
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
గాంధీ నడికుడికర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేయగా ఆయన అందించిన వర్క్ ఓ విజువల్ ట్రీట్‌ను అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ సినిమాలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారని అంటున్నారు. దేవాన్ష్ నామా సమర్పకుడిగా.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తుండగా శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా కళ్యాణ్ రామ్ తో పాటు సంయుక్త, మాళవికా నాయర్ తదితరులు నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!