ఈద్ కానుకగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు గత రెండు రోజులుగా సెట్స్ పై ఉన్న తమ సినిమాలకు బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు ఇరవై మంది ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేశారు. అయితే ఇప్పటికీ కొందరు తమ చిత్రాలను ఏ రోజున విడుదల చేస్తే, ఏ సమస్య వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడు మోహిత్ సూరి ఓ క్లారిటీకి వచ్చేశాడు.
జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటాని ప్రధాన పాత్ర ధారులుగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్’ మూవీని ఈద్ కానుకగా 8 జూలై 2022 రోజున విడుదల చేయబోతున్నాడు. 2014లో శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఏక్ విలన్’కు ఇది సీక్వెల్. ‘ఏక్ విలన్ రిటర్న్స్’ను తొలుత వచ్చే యేడాది ఫిబ్రవరి 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి కాలేదు. దాంతో ఇప్పుడీ సినిమాను ఈద్ టైమ్ కు పోస్ట్ పోన్ చేశారు. ‘ఈసారి ఈదీ విలన్ ను ఇవ్వబోతున్నామని, విడుదల తేదీ 8 జూలై 2022ను గుర్తుపెట్టుకోమ’ని కోరుతూ రిలీజ్ డేట్ పోస్టర్ ను జాన్ అబ్రహం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆడవాళ్ళు సైతం విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారని మోహిత్ సూరి తెలిపారు.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు