Site icon NTV Telugu

Radhe Shyam : సూపర్ కూల్ గా “ఈ రాతలే” సాంగ్ ప్రోమో

Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ “జాన్ హై మేరీ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్ లో విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే) అనుకోకుండా కలిసిన సన్నివేశాలను చూపించారు. వర్షం, మంచులో ఉన్న షాట్‌లు చూస్తుంటే విక్రమాదిత్య ఆమెను చాలా కాలం పాటు అనుసరిస్తున్నట్లు అన్పిస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also : Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Exit mobile version