Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా కావ్య థాపర్, నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది.
ఇటీవలే విడుదల చేసిన ఈగల్ ఊర మాస్ అంథమ్ ఆడు మచ్చా పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు మేకర్స్ ఈగల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈగల్ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ పెద్ద మిషన్ గన్ తో ఫైర్ చేసున్న టెర్రిఫిక్ లుక్ లో కట్టిపడేశాడు. టీజర్ తోనే ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో రవితేజ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా.. ? లేదా అనేది చూడాలి.