Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి

Cheen Tapak Dum Dum

Cheen Tapak Dum Dum

తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన టైటిల్స్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి ఈ క్రమంలోనే తాజాగా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుభం సినిమాతో నటుడిగా మారిన గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో, సోషల్ మీడియా సెన్సేషన్ దువ్వాడ మాధురి ‘గైరమ్మత్త’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. వై.ఎన్. లోహిత్ దర్శకత్వo ఈ చిత్రాన్ని తనదైన శైలిలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నాగులపల్లి శ్రీను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం సహా హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదలైన మాధురి పోస్టర్ చూస్తుంటే, ఆమె పాత్ర సినిమాలో చాలా వైవిధ్యంగా మరియు గంభీరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. నర్సీపట్నం పరిసర ప్రాంతాల సహజత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది అని టీం చెబుతోంది. దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ తో సోషల్ మీడియాలో, మీడియాలో హాట్ టాపిక్ అయిన మాధురి గత బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొంది. ఇప్పుడు ఆమెకు అత్త పాత్రలు రావడం గమనార్హం.