Site icon NTV Telugu

Dunki Day 1 Collections: అయ్యయ్యో రెండు వెయ్యి కోట్ల సినిమాలు కూడా కాపాడలేకపోయనే

Dunki Day 1 Collections

Dunki Day 1 Collections

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు చేసిన షారుఖ్… పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాడు. పఠాన్ వెయ్యి కోట్లైతే, జవాన్ 1150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి షారుఖ్ కెరీర్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒకే ఇయర్ రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఉన్న హీరోగా షారుఖ్ ని నిలబెట్టాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా షారుఖ్ ఖాన్ ని డంకీ విషయంలో హెల్ప్ చేయలేకపోయాయి. రాజ్ కుమార్ హిరాణీ బ్రాండ్, షారుఖ్ ఖాన్ ఇమేజ్ అండ్ క్రేజ్ తో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది డంకీ సినిమా. పాజిటివ్ వైబ్ తో రిలీజైన డంకీ మూవీ నెగటివ్ టాక్ ని, డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

Read Also: Salaar: కెజీఎఫ్-సలార్ విషయంలో ఈ కోయిన్సిడెన్స్ అదిరిపోయింది…

రిలీజ్ పరంగా మంచి నంబర్ ఆఫ్ థియేటర్స్ ని సొంతం చేసుకున్న డంకీ సినిమా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 కోట్ల  ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే షారుఖ్ ఖాన్ ఇమేజ్ కూడా డంకీ సినిమాని కాపాడలేకపోయిందనే చెప్పాలి. జవాన్ సినిమాతో వంద కోట్ల ఓపెనింగ్, పఠాన్ సినిమాతో 90 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టాడు షారుఖ్ ఖాన్. అలాంటిది ఈసారి మాత్రం కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం బాధాకరం. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ కాబట్టి డంకీ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో జవాన్, పఠాన్ ల రొటీన్ మాస్ సినిమాల ముందు డంకీ లాంటి క్లాస్ సినిమా నిలబడలేకపోయిందనే చెప్పాలి.

Exit mobile version