సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF, సలార్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద కోయిన్సిడెన్స్ ఉంది. KGF పార్ట్ 1 మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా హిట్ అయిన ఈ మూవీ రిలీజ్ డేట్ రోజునే హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా విడుదలయ్యింది. 2018 డిసెంబర్ 21 జీరో సినిమా ఇచ్చిన రిజల్ట్ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు కూడా చేయలేదు. ఇదే 2018 డిసెంబర్ 21న హాలీవుడ్ మూవీ ఆక్వామన్ సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల తర్వాత హిస్టరీని రిపీట్ చేస్తూ… ప్రశాంత్ నీల్ తన సినిమా సలార్ ని అదే షారుఖ్ ఖాన్ ని అపోజిట్ గా రిలీజ్ చేసాడు. డిసెంబర్ 21న డంకీ సినిమా రిలీజ్ అయ్యి, జీరో టైమ్ లో లాగానే ఇప్పుడు కూడా షారుఖ్ ఖాన్ నెగటివ్ టాక్ ఫేస్ చేయాల్సి వచ్చింది.
హాలీవుడ్ నుంచి కూడా ఆక్వామన్ 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈసారి ఆక్వామన్ 2 కూడా నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అయితే అయిదేళ్ల క్రితం బాక్సాఫీస్ వార్ కి ఇప్పటి బాక్సాఫీస్ కి వార్ కి విన్నర్ ప్రశాంత్ నీల్ మాత్రమే. కాకపోతే అప్పుడు హీరో యష్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. పైగా జీరో సమయంలో షారుఖ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, డంకీ అలా కాదు బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో షారుఖ్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో కూడా ప్రశాంత్ నీల్ సలార్ తో షారుఖ్ కి షాక్ ఇచ్చాడు. ఓవర్సీస్ లోని కొన్ని సెంటర్స్ లో ఆక్వామన్ 2 సినిమాకి కూడా షాక్ ఇస్తోంది సలార్. ఇది బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ అనే చెప్పాలి.