NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ను షేర్ చేశారు. శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ విలన్ పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు తన హీరోకు తగిన విలన్ దొరికాడు అంటూ సంతోష పడిపోతున్నారు. ఇక ఈ కనడ స్టార్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందంటే. మాస్ అండ్ రస్టిక్ మేకోవర్ లో విజయ్ లుక్ అదిరిపోయింది.
Read Also : The Kashmir Files : ప్రభుత్వం సంచలన నిర్ణయం… సినిమా చూడమంటూ హాఫ్ డే లీవ్ !
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. NBK 107లో ఇక బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
