Dulquer Salman: బాయ్ కాట్ రచ్చ.. బాలీవుడ్ లో బాంబ్ పేల్చిన ‘సీతారామం’ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulquer Salman: సీతారామం చిత్రంతో తెలుగు నాట స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం హిందీలో చుప్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆర్. బాల్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెత్త రివ్యూలు రాసేవారిని దారుణంగా హత్య చేస్తున్న ఒక సైకో కిల్లర్ కథ ఇది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయారు. తాజాగా ఈ ఇంటర్వ్యూలలో దుల్కర్ నోరు జారడాని వార్తలు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ లో తప్ప మరెక్కడా లేదని, సౌత్ ఇండస్ట్రీ అంతా చాలా మంచిదని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు దుల్కర్ మాట్లాడుతూ “భయంకరమైన బాయ్ కాట్ కల్చర్ ను నేను బాలీవుడ్ లోనే వింటున్నాను.. సౌత్ లో ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు.. సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి నచ్చింది వారు ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా కారణంగానే ఈ బాయ్ కాట్ కల్చర్ ఎక్కువైంది” అని చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ సినిమా చేస్తూ, బాలీవుడ్ లో ఇంటర్వ్యూ ఇస్తూ బాలీవుడ్ పైనే బాంబ్ పేల్చాడు దుల్కర్.. ఈ ప్రభావం కచ్చితంగా తాం సినిమాపై పడుతుందని అంటున్నారు నెటిజన్లు.. నార్మల్ గా టాలీవుడ్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి మాట్లాడితే నానా రభస చేసే బి టౌన్ వారు.. డైరెక్ట్ గా వారి గురించి అక్కడే మాట్లాడితే ఊరుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొంతమంది దుల్కర్ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. మనసులో ఏదైతే ఉందో దాన్ని దైర్యంగా చెప్పి మంచి పని చేసావ్ అంటున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ వస్తే కానీ దుల్కర్ మాటల ప్రభావం ఎలా ఉందో చెప్పలేమంటున్నారు అభిమానులు.
Also Read
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
తాజావార్తలు
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..