Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Traces Found from Blood Samples of Hema and Aashi Roy: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇద్దరు టాలీవుడ్ నటులున్నట్టు తేలింది. నటి హేమతో పాటు నటి అషి రాయ్ లకు చేసిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఈ డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన విచారణ జరుపుతున్నారు అధికారులు. ఇక ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులను చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా?
Also Read
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
కొకైన్ తో పాటు 500 రూపాయల నోట్లు ఉన్నాయని, అవి పౌడర్ ను పీల్చేందుకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఈ కేసులో 5 మొబైల్ ఫోన్స్, ఒక వోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర డీజే ఎక్విప్మెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్స్ ట్రెసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది A2 అరుణ్ కుమార్ కాగా ఫామ్ హౌజ్ ని వాసు స్నేహితుడు గోపాల్ రెడ్డి బుక్ చేశాడు. ఇక A4 రణధీర్ కారులో డ్రగ్స్ లభ్యం కాగా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!