Site icon NTV Telugu

Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్

Draupathi

Draupathi

Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ద్రౌపది 2’. ఈ సినిమాను నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. మోహన్. జి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఇందులో ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ గాంభీర్యంగా హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి.

Read Also : Dharmendra : ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ హీరోల సంతాపం

పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఈజీగానే అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఈ సినిమాను తీస్తున్నామని మూవీ టీమ్ చెబుతోంది. పోస్టర్లను చూస్తుంటేనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అర్థం అవుతోంది.

Read Also : IBomma Ravi :36 బ్యాంకు ఖాతాలు.. క్రిప్టో కరెన్సీ.. విచారణలో షాకింగ్ విషయాలు

Exit mobile version