NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ గ్లింప్స్ రిలీజ్ కు మేకర్స్ టైమ్ లాక్ చేసారు.
ఈ మంగళవారం రాత్రి సరిగ్గా 11:52 గంటలకు ఈ చిత్ర గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నారు. అంటే.. తారక్ పుట్టినరోజుకు కేవలం ఎనిమిది నిమిషాల ముందే ఈ మాస్ అప్డేట్ రాబోతోంది. వాస్తవానికి అర్ధరాత్రి 11.59 గంటలకు రిలిజ్ చేయాలనీ భావించారు. కానీ సెంటిమెంట్ లేదా ప్రత్యేకమైన నంబర్ కాలిక్యులేషన్స్ ప్రకారం చిత్ర బృందం ఈ 11:52 PM సమయాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో నార్త్ నుండి సౌత్ వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కెజిఎఫ్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను ఏ రేంజ్ మాస్ ఎలివేషన్లతో చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ గ్లింప్స్ ద్వారా డ్రాగన్ టైటిల్‌ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లింప్స్ కోసం కంటిమీద కునుకు లేకుండా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!