NTV Telugu Site icon

NTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం

Ntr30 Double Updates

Ntr30 Double Updates

Double Updates From NTR30 Project: జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. NTR30 ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ఆ శుభ ఘడియలు వచ్చేశాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. మార్చి 18వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి కొందరు ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి 30వ తేదీ నుంచి స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఆస్కార్ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో అమెరికాలో ఉన్న తారక్.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి తిరిగి రాగానే NTR30 సినిమా పనుల్ని షెడ్యూల్ ప్రకారం మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో.. గ్యాప్ ఇవ్వకుండా శరవేగంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 05వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే!

Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు

‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా రూపొందుతుండడంతో.. ఈ NTR30 ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి.. దీనిని మొదట్లో రీజనల్ మూవీగా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్‌తో తారక్‌కి వచ్చిన భారీ క్రేజ్ నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యారు. అందుకే.. ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్, ఇంతకాలం ఆలస్యం అయ్యింది. ఇక ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆ అమ్మడి పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం అధికారికంగా తమ సినిమాలో జాన్వీ కథానాయికగా నటిస్తోందంటూ పోస్టర్ లుక్‌తో ప్రకటించారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం.

Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..

Show comments