Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 21వ తేదీ మాస్ పండగకు వేదిక కాబోతోంది. టాలీవుడ్ ఇద్దరు అగ్ర సీనియర్ స్టార్ హీరోలు అయిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తమ ప్రతిష్టాత్మక చిత్రాలను ఒకే రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు లాంచ్ అవుతుండటంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచంలో సరికొత్త జోష్ నెలకొంది.
వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న NBK112 ప్రాజెక్ట్ మే 21న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ‘పవర్ మీట్స్ పర్పస్’ మాస్ బికమ్స్ ఎ మూవ్మెంట్’ అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ బాలయ్య రేంజ్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో క్రేజ్ వేరే లెవల్ లో ఉంది.
Also Read
- Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
- Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. ‘భోగి’తో హిట్ కొడతా!
- Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు 'తలా'లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ Mega158 కూడా మే 21నే ముహూర్తపు వేడుక నిర్వహించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ సాలిడ్ లుక్‌లోకి మారుతున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు సీనియర్ టాప్ స్టార్స్ ఒకే రోజు తమ కొత్త సినిమాలను ప్రారంభించడంతో ఈ రెండు సినిమాలు ఇప్పడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!