Uday Shankar: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ నుండి ‘దోస్త్…’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dost Ante Nuvvera Song Released From Nachindhi Girlfriend: యంగ్ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. జెన్నీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..’ అనే లిరికల్ సాంగ్ ను నిజజీవితంలో మంచి మిత్రులైన టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న రోహిత్, శ్రీవిష్ణు… చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.
ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ ప్రభాస్ – గోపీచంద్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, మహేష్ బాబు – వంశీ పైడిపల్లి లాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాట గురించి రాహుల్ సిప్లిగంగ్ మాట్లాడుతూ, ”దీనిని పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేసాను. దోస్త్ లందరికీ ఇది ఒక ఆంథమ్ సాంగ్ అవుతుందని నా నమ్మకం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ దర్శకుడు గిఫ్టన్ కి, దర్శకుడు గురు పవన్ కి థ్యాంక్స్” అని అన్నారు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజావార్తలు
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!