హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” సినిమా సృష్టించిన సంచలనంతో మరోసారి స్పష్టమైంది. అప్పటికే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు “పుష్ప” ఫీవర్ ఉన్నప్పటికీ, తక్కువ థియేటర్లలోనే విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. ఇక మరోమారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మ్యాడ్ నెస్ కు మరో మార్వెల్ సూపర్ హీరో మూవీ “Doctor Strange In The Multiverse Of Madness” రెడీ అవుతోంది.
Read Also : RGV : రాముడు కాదు రావణుడిని… నెటిజన్ కు వర్మ వెరైటీ రిప్లై
సామ్ రైమి దర్శకత్వంలో రూపొందిన “Doctor Strange In The Multiverse Of Madness”లో బెనెడిక్ట్ కంబర్‌బాచ్, చివెటెల్ ఎజియోఫోర్, ఎలిజబెత్ ఒల్సేన్, బెనెడిక్ట్ వాంగ్, క్సోచిట్ల్ గోమెజ్, మైఖేల్ స్టూల్‌బర్గ్, రాచెల్ మెక్‌ఆడమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ “డాక్టర్ స్ట్రేంజ్” ఆధారంగా తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రం పార్ట్ 1 ఎప్పుడో విడుదలైన విషయం తెలిసిందే. Doctor Strange 2కు మాత్రం మేకర్స్ చాలా సమయమే తీసుకున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన “Doctor Strange In The Multiverse Of Madness” టీజర్ లో డాక్టర్ స్ట్రేంజ్ తన మిత్రులతో కలిసి ఒక పవర్ ఫుల్ విలన్ ను ఎదుర్కొనేందుకు మల్టీవర్స్‌లోకి ప్రయాణిస్తున్నట్లు చూపించింది. కాగా “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్” భారతదేశంలోని ఆరు భాషల్లో విడుదల కానుంది. MCU ఫేజ్ 4లో భాగమైన “Doctor Strange In The Multiverse Of Madness” చిత్రం మే 6న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 3D, ఐమ్యాక్స్ 3D ఫార్మాట్లలో రిలీజ్ కు రెడీ అవుతోంది.