Site icon NTV Telugu

నయన తారని వదిలి వెళ్లిన ప్రియుడు.. పోస్ట్ వైరల్

nayan- vignesh

nayan- vignesh

కోలీవుడ్ ప్రేమ జంట నయనతార- విఘ్నేష్ శివన్ ప్రస్తుతం విరహవేదనలో ఉన్నారు. ఇద్దరు తమ తమ పనుల్లో బిజీగా వేరోచోట ఉండడంతో విఘ్నేష్, ప్రియురాలిని బాగా మిస్ అవుతున్నాడట. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. దీంతో పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.  ‘రౌడీ పిక్చర్స్‌’ బ్యానర్‌‌ను ప్రారంభించి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నయన్ పక్కనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు ఈ డైరెక్టర్ . దీంతో నయన్ ని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు.

నయన్ ఫోటో షేర్ చేస్తూ ” ఈసారి నీతో ట్రావెలింగ్ ని మిస్ అవుతున్నాను.. ఒక పని పెండింగ్ లో ఉండడంతో నేను ఒక్కడినే రావాల్సి వచ్చింది. త్వరగా ఈ పని ముగించుకొని వచ్చేస్తాను.. లాంగ్ హాలిడే కి వెళ్దాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అరే.. ప్రియురాలిని ఒక్క క్షణం కూడా వదలలేకుండా ఉన్నాడే.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే విఘ్నేష్ దర్శకత్వంలో నయన్, సమంత, విజయ్ సేతుపతి నటిస్తున్న  ‘కాతు వాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్దమవుతుంది.

Exit mobile version