Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Director Vi Anand Interview For Ooru Peru Bhairavakona

VI Anand: కర్మ సిద్ధాంతం, గరుడ పురాణం నేపథ్యంలో ‘ఊరు పేరు భైరవకోన’.. చాలా ఎంజాయ్ చేస్తారు

Published Date :February 12, 2024 , 9:05 pm
By Bhargav Chaganti
VI Anand: కర్మ సిద్ధాంతం, గరుడ పురాణం నేపథ్యంలో ‘ఊరు పేరు భైరవకోన’.. చాలా ఎంజాయ్ చేస్తారు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Director VI Anand Interview for Ooru Peru Bhairavakona: యంగ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నేపథ్యంలో దర్శకుడు విఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

‘ఊరు పేరు భైరవకోన’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
-‘టైగర్’ తర్వాత నేను సందీప్ కలిసి మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ‘డిస్కో రాజా’ తర్వాత ఈ కథ రాసుకునే సమయం దొరికింది, దీంతో పాటు మరో కథ కూడా వుంది. ఈ రెండు ఐడియాలని సందీప్ కి చెప్పినపుడు.. ‘ఊరు పేరు భైరవకోన’ కథకు చాలా ఎక్సయిట్ అయ్యారు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్త వుంటుంది, ఒక ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుదని ఫిక్స్ చేశాం. ఇప్పటివరకు సందీప్ కూడా సూపర్ నేచురల్ ఫాంటసీ జోనర్ చేయలేదు. ఆయనకు కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బిగ్ స్క్రీన్ పై విజువల్, సౌండ్ పరంగా ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. రాజేష్ అప్పటికి ఇంకా తొలి సినిమా నిర్మించలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఎక్సయిట్ అయ్యారు. నిజానికి హాస్య మూవీస్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 ‘ఊరు పేరు భైరవకోన’. మా మంచి కోరే వ్యక్తి అనిల్ గారు. ఆయన ఈ ప్రాజెక్ట్ లో వస్తే బావుంటుందని కోరుకున్నాం. అలా అనిల్ గారు జాయిన్ అవ్వడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది.

Also Read

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
Add as a preferred
source on google

‘ఊరు పేరు భైరవకోన’ కథలో కర్మ సిద్ధాంతం, గరుడ పురాణం నేపథ్యం ఎలా ఉండబోతుంది ?
-కథ రాసిన తర్వాత డైలాగ్స్ రైటింగ్ టైంలో కొన్ని టైటిల్స్ అనుకున్నాం. అందులో
‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్ అనిపించి ఫిక్స్ చేశాం. టైటిల్ మైథాలజీ టచ్ వుంది. ఈ కథలో కూడా కర్మ సిద్ధాంతం, గరుడ పురాణం, శివ దండం లాంటి నేపధ్యాలు వున్నాయి కాబట్టి ఈ టైటిల్ సరిగ్గా నప్పుతుంది. కర్మ సిద్ధాంతం నియమంలోనే ఈ కథ ఉంటుంది. మన చేసిన కర్మ వేరే విధంగా తిరిగి వస్తుంది. స్టొరీ లైన్ లోనే ఈ ఫిలాసఫీ ఉంది,. లైఫ్, డెత్ గురించి నాకు చాలా ఆసక్తి. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం గరుడ పురాణంలో వివరంగా ఉంది. ఈ జర్నీ చాలా ఆసక్తి కలిగించింది.

అనిల్ సుంకర ఈ సినిమా విజయం మా అందరికీ చాలా కీలకం అన్నారు కదా.. సినిమా మేకింగ్ సమయంలో ఈ విషయంలో ఒత్తిడికి లోనయ్యారా ?
-ఒత్తిడి అయితే వుంది. ఎంత గొప్ప కథ చెప్పినా, ఎంత పేరు వచ్చినా ఫైనల్ గా కమర్షియల్ సక్సెస్ కావాలి. ‘ఊరు పేరు భైరవకోన’ పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది. నా కెరీర్ లోనే బిగ్గర్ ఓపెనింగ్ భైరవ కోనకి రావడం చాలా ఆనందంగా వుంది.

సాధారణంగా ఫాంటసీ అడ్వెంచర్ కథలకు విజువల్స్ కోసం బడ్జెట్ సమస్యలు వస్తుంటాయి.. ఈ సినిమా విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారు ?
-ఈ సినిమాకి ప్రొడక్షన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్ గా రూపొందించాం. అలాగే ఎక్కడ కూడా వృధా చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అనిల్, రాజేష్ కథని చాలా బలంగా నమ్మి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. జనాలని థియేటర్స్ కి తీసుకురావాలంటే వారికి కావాల్సిన విజువల్ ఎక్స్ పీరియన్స్, కంటెంట్ ఇవ్వాలని ముందే నిర్ణయించుకొని సినిమా చేశాం. ఇది యూత్, ఫ్యామిలీతో పాటు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది.

భైరవ కోనలో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ ఎలా ఉంటుంది ?
-ఇందులో వెన్నెల కిషోర్ ట్రాక్ భలే వర్క్ అవుట్ అయ్యింది. డాక్టర్ నారప్ప అనే హిలేరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే వైవా హర్ష పాత్రలో కూడా ఫన్ ఎలిమెంట్ భలే కుదిరింది. అలాగే కావ్య థాపర్ లో కూడా చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో చాలా మంచి ఫన్ వుంది. ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫన్ రైడ్ లా ఉంటుంది.

మీ సినిమాల్లో ట్విస్ట్ లు బాగుంటాయి.. ఇందులో ట్విస్ట్ లు ఉన్నాయా ?
-రెండు పెద్ద ట్విస్ట్ లు వున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న ట్విస్ట్ లు కూడా వున్నాయి. ప్రతి పది నిమిషాలకు ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. థియేటర్ లో ఎంజాయ్ చేసి చూసే సినిమా ఇది.

నిజమేనే చెబుతున్నా పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించారా ?
-నిజంగా ఊహించలేదు. పాట మాకు నచ్చింది. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే కీలకమైన పాట ఇది. వారి లవ్ కెమిస్ట్రీ కి హెల్ప్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద రీచ్ వస్తుందని అనుకోలేదు. శేఖర్ చంద్ర చక్కని ట్యూన్, శ్రీమణి లిరిక్స్, సిద్ శ్రీరామ్ వాయిస్.. ఇవన్నీ పాటని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పాట ఇంత పెద్ద హిట్ అవ్వడం గొప్ప విషయం. ఇప్పుడున్న ఓపెనింగ్స్ కు ఈ పాట చాలా హెల్ప్ అయ్యింది.

మీరు పరిశ్రమకి వచ్చి పదేళ్ళు అవుతుంది..ఈ ప్రయాణం ఎలా అనిపించింది ?
-జర్నీ ఆనందంగా వుంది. అయితే ఇంకో మూడు చిత్రాలు ఫిల్మోగ్రఫీలో యాడ్ అయ్యింటే బావుండేదనిపిస్తుంటుంది. నా చేతిలో లేని పలు కారణాల వలన కొన్ని ప్రాజెక్ట్స్ ఆలస్యమయ్యాయి.

మీ కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
-నిఖిల్ తో ఓ సినిమా చర్చల్లో వుంది. కథ రాస్తున్నాను. అలాగే ఓ పెద్ద హీరోకి కథ రాస్తున్నాను. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ooru Peru Bhairavakona
  • vi anand interview
  • vi anand news

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions