Venky Atluri: డైరెక్టర్ ‘సార్’ పెళ్లి అయిపొయింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ విషయం మర్చిపోయేలోపు టాలీవుడ్ లో మరో పెళ్లి న్యూస్ బయటకి వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ‘పూజ’ల వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హీరో నితిన్, కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుములతో పెళ్లి జంట దిగిన ఫోటో సోషల్ మీడియాలోకి రావడంతో వెంకీ అట్లూరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది. తక్కువ మంది గెస్టులతో, తన సన్నిహితుల మధ్య పూజాతో వెంకీ అట్లూరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం హీరో ధనుష్ తో ‘సార్’ సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి, దర్శకుడి కన్నా ముందు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2010లో మధుర శ్రీధర్ డైరెక్ట్ చేసిన ‘స్నేహగీతం’ సినిమాలో ఒక హీరోగా వెంకీ అట్లూరి నటించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో ఒక హిట్, ఒక యావరేజ్, ఒక ఫ్లాప్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ధనుష్ తో చేస్తున్న సార్ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో సాలిడ్ హిట్ కొట్టి స్టార్ దర్శకుల లీగ్ లోకి వెళ్లాలని చూస్తున్న వెంకీ అట్లూరి, ఫిబ్రవరి 17న తన లక్ టెస్ట్ చేసుకోనున్నాడు.
Congratulations Venky Swamy for the new chapter unlocked in your life!! Wishing you and Pooja a beautiful life ahead 🤗🤗 pic.twitter.com/NEmazfwcAc
Also Read
- Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్... ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
- Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
- Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ 'పార్వేట'
- Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
— nithiin (@actor_nithiin) February 1, 2023
Read Also:Sharukh Khan: ‘జవాన్’గా మారిన ‘పఠాన్’
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!