Tharun Bhaskar : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెతో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెతో దీపావళి వేడుక జరుపుకున్నాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ ఈషారెబ్బా. వరంగల్ కు చెందిన తరుణ్ భాస్కర్, అదే వరంగల్ అమ్మాయి అయిన ఈషాతో ఇలా కనిపిస్తున్నాడు.
Read Also : Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్
తాజాగా విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో వీరిద్దరూ సందడి చేశారు. తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా క్లోజ్ గా కనిపించారు. అందుకే మరోసారి ఈ రూమర్లు వైరల్ అవుతున్నాయి. కానీ తరుణ్ భాస్కర్ అభిమానులు మాత్రం ఆయన త్వరలోనే ఈషారెబ్బాతో సినిమా చేయబోతున్నాడని అందుకే ఇలా క్లోజ్ గా ఉంటున్నాడని అంటున్నారు. ఆ మధ్య తిరుమలలో వీరిద్దరూ కలిసి కనిపించారు. అప్పటి నుంచే రూమర్లు వినిపిస్తున్నాయి. ఈషారెబ్బా హీరోయిన్ కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువ క్రేజ్ వచ్చింది ఈ బ్యూటీకి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలతో బిజీగా ఉంది.
Read Also : Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్