Suman Shetty : కమెడియన్ సుమన్ శెట్టి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొన్నాడు. తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచేస్తున్నాడు. అయితే సుమన్ శెట్టి హౌస్ లో తాను ఇల్లు కొనుక్కోవడం వెనకాల ఉన్న రీజన్ చెప్పాడు. సుమన్ శెట్టికి ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది డైరెక్టర్ తేజ. సుమన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే. తేజ పరిచయం చేసిన తర్వాత సుమన్ కు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాంటి టైమ్ లో సుమన్ శెట్టి ఓ సారి తేజ దగ్గరకు వెళ్లాడు. సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగాడు తేజ.
Read Also : Manchu Lakshmi : అమరావతిలో స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ..
‘నేను తేజ గారిని ఈ డబ్బులు ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఓ సలహా ఇచ్చారు. ఇప్పుడున్న ఈ మణికొండ, నానక్ రాం గూడ, బంజారా హిట్స్, కొండాపూర్ తర్వాత కాలంలో బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ ఏరియాలో ఓ మంచి ఇల్లు కొనుక్కో. ఇప్పుడు చాలా తక్కువకు ఇక్కడ స్థలాలు దొరుకుతున్నాయి అని సలహా ఇచ్చారు. ఆయన మాటతో మణికొండలో స్థలం కొని ఇల్లు కట్టాను. నేను కొన్నప్పుడు చాలా తక్కువ ధర ఉండేది. పెద్దగా ఇళ్లు ఉండేవి కావు. కానీ తేజ గారు చెప్పినట్టే ఇప్పుడు సిటీలో ఇదే ఖరీదైన ఏరియాగా మారింది. నా ఇల్లు ఇప్పుడు వంద రేట్లు ధర పెరిగింది. ఆయన వల్లే నాకు ఈ పొజీషన్ వచ్చిందంటూ తెలిపాడు సుమన్ శెట్టి.
Read Also : Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?
