Director Teja: షకీలా.. పేరు తెలియని వారుండరు. ఈ పేరు గురించి, మనిషి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా ఆమెకున్న పాపులారిటీ అది. అలా అని కేవలం.. ఆమెను తక్కువ చేసి చూడలేం. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసి కూడా మెప్పించింది. ఇక తెలుగులో షకీలా ఎన్ని సినిమాలు చేసినా జయం సినిమాలో లెక్చరర్ పాత్ర మాత్రం మొదట గుర్తొస్తుంది. కమెడియన్ సునీల్ శెట్టికి ఆమె వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఇప్పటికీ టాప్ కామెడీ క్లిప్స్ లో ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక ఆమెకు ఆ అవకాశం డైరెక్టర్ తేజ ఎలా ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ విషయాన్ని తేజ అహింస ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Sunisith: ప్యాంట్ తడిచేలా భయపెట్టినట్టున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సారీ చెప్పక చస్తాడా
“నేను, ఆర్పీ పట్నాయక్, మరొక వ్యక్తి ముగ్గురం కలిసి.. హైదరాబాద్ లోని ఒక థియేటర్ వైపుగా వెళ్తుంటే.. కుర్రాళ్ళు టికెట్ కౌంటర్ దగ్గర కొట్టుకుంటున్నారు. గుంపులు గుంపులుగా వస్తుంటే.. ఏంటా అని వెళ్ళాం. అక్కడ కామేశ్వరి అనే సినిమా ఆడుతుంది. నేను మేనేజర్ ను అడిగి మూడు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం. అలా టికెట్ తీసుకొని నేను లోపలికి వెళ్తుంటే.. మేనేజర్.. వీళ్ళు కూడా ఈ సినిమాలు చూస్తారా అంటూ గొణిగాడు. ఇక మేము లోపలికి వెళ్ళగానే.. కుర్రాళ్ళు హారతి పళ్లాలతో నిలబడి ఉన్నారు. తెరపై షకీలా రాగానే హారతి ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు ఆమెను ఫిక్స్ చేశాను.” అంటూ చెప్పుకొచ్చాడు. ఒక డైరెక్టర్..ఇలా ప్రమోషన్స్ ఈవెంట్ లో షకీలా గురించి చెప్పడం చాలా ఆశ్చర్యమని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే అహింసలో దగ్గుబాటి వారసుడు అభిరామ్ నటిస్తుండగా అతని సరసన గీతిక కథానాయికగా నటిస్తోంది. మరి ఈ సినిమాతో అభిరామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.