Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Teja: తన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ తేజ. తాజాగా ఆయన చేసిన పలు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను డైరెక్టర్‌గా మారడానికి కారణమైన పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. ప్రతిభ లేని కొందరు దర్శకులతో కలిసి పనిచేయాల్సి రావడం వల్లే తనలోని దర్శకుడు బయటకు వచ్చాడని తేజ చెప్పుకొచ్చారు. వారి మేకింగ్ స్టైల్ చూసిన తర్వాత తాను కూడా వారికంటే మంచి సినిమా తెరకెక్కించగలననే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు.
తన సినీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో పలువురు దర్శకుల వద్ద పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్న తేజ, కొన్ని సందర్భాల్లో దర్శకులు సెట్స్‌లో పూర్తి బాధ్యత తీసుకోకుండా ఉండేవారని వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సన్నివేశాలను తానే ప్లాన్ చేసి, వాటిని షూట్ చేసే బాధ్యత కూడా తనపై పడేదని చెప్పుకొచ్చారు. ఆ అనుభవాలే తర్వాత కాలంలో తనకు డైరెక్షన్‌పై అవగాహనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని వెల్లడించారు. అయితే తనకు ఆ బుర్రలేని డైరెక్టర్ల పేర్లను బయటపెట్టే ఉద్దేశం లేదని తేజ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో కలిసి పనిచేసిన వారిని గౌరవించడం తన స్వభావం అని, అలాగే ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం తనకు స్వభావం కాదని వెల్లడించారు. గతంలో ఎదురైన అనుభవాలను ఇప్పుడు కేవలం జీవిత పాఠాలుగా మాత్రమే చూస్తానని పేర్కొన్నారు. అయితే దర్శకుడిగా తన ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయన చెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే దానిపై నెటిజన్ల నుంచి విభిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read
- Casting Couch: 'బట్టలు విప్పమన్నారు'.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
- Toxic Effect: యశ్ 'టాక్సిక్' ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
- Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్... ఈరోజే 'హైవానియత్' టీజర్
- SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!