Shankar: సైలెంట్‌గా చేస్తున్నారు మావా… కానీ అప్డేట్ ఇవ్వడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు కావొస్తుంది కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోవడం లేదు. స్టార్టింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడమే లేట్ అన్నట్టుగా జెట్ స్పీడ్‌లో షూట్ చేశాడు శంకర్. ఊహించని విధంగా ఇండియన్ 2 లైన్లోకి రావడంతో ‘గేమ్ చేంజర్’ డిలే అవడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి శంకర్ ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా షూటింగ్ చేస్తున్నాడు. నెలలో హాఫ్-హాఫ్ డేస్ పెట్టుకొని చైన్నై టు హైదరాబాద్ తిరుగుతున్నాడు. అయితే ఈ మధ్య గేమ్ చేంజర్ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగష్టు 17న శంకర్ బర్త్ డే కావడంతో… గేమ్ చేంజర్ సెట్స్‌లో గ్రాండ్‌గా కేక్ కట్ చేసిన సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు నిర్మాత దిల్‌రాజు కూడా ఉన్నాడు.
శంకర్ చేత కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలియజేశాడు చరణ్. ప్రస్తుతం శంకర్‌కు రామ్‌చరణ్ కేక్ తినిపిస్తోన్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మరోవైపు మెగాఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ అప్డేట్ కావాలని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మేకర్స్ మాత్రం ఎలాంటి లీకులు గానీ, అప్డేట్స్ గానీ ఇవ్వడం లేదు. అసలు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందనే విషయం శంకర్ బర్త్ డే వల్లే తెలిసింది. అయినా కూడా శంకర్ బర్త్ డే నాడు కనీసం చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ డే నాడు కూడా ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ శంకర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ… అప్టేడ్ కావాలని అడుగుతున్నారు. మరి గేమ్ చేంజర్ అసలు గేమ్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. ఇక కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!