Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై ‘పోలీస్ కంప్లైంట్’ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిమెంట్ నిబంధనలను ఉల్లంఘించి, సినిమా ప్రమోషన్స్‌కు ఆమె మొహం చాటేయడం వల్ల తమ చిత్రానికి ఊహించని స్థాయిలో భారీ నష్టం వాటిల్లిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సంజీవ్ మేగోటి వరలక్ష్మి ప్రవర్తనపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.
“ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఆమె కెరీర్లోనే గుర్తుండిపోయే పవర్ఫుల్ పాత్ర లభించింది. షూటింగ్ సమయంలో ఆమె సౌకర్యం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా అన్ని విధాలా సహకరించారు. కానీ, ఆమె మాత్రం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మాకు ఎన్నో ఇబ్బందులు సృష్టించింది” అని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం కేవలం ఒకే ఒక్క గంట సమయం కేటాయించమని బతిమాలినా ఆమె స్పందించలేదని దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ ఇవ్వడంపై మేకర్స్ మండిపడుతున్నారు. తమ సినిమా కాన్సెప్ట్ అయిన ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ తరహాలోనే, చేసిన తప్పుకు ‘కర్మ’ ఆమెను కూడా వదిలిపెట్టదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు