Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి వరకు ఓకే. మరి మిగతా టాలీవుడ్ వాళ్లకు ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇంత పెద్ద వరదలు వచ్చి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే.. టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also : Rangaraj : ఆరు నెలల గర్భిణితో హీరో పెళ్లి.. చివరకు భారీ ట్విస్ట్
హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు, నటీనటులు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే వెంటనే స్పందించి.. విరాళాలు కోట్లలో ప్రకటించి.. టాలీవుడ్ నుంచి నిధులు సేకరించే సెలబ్రిటీలు.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మండిపడుతున్నారు. సందీప్ రెడ్డికి ఉన్న ఆలోచన కూడా వాళ్లకు లేదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. తెలంగాణ నుంచి సినిమాలకు భారీగా కలెక్షన్లు రాబట్టుకోవడం వరకేనా.. తెలంగాణ వాళ్లకు ఆపద వస్తే కనీసం స్పందించలేరా అంటూ మండిపడుతున్నారు సినిమా ప్రేక్షకులు. గతంలో టాలీవుడ్ ఏ రాష్ట్రం విషయంలో ఎలా స్పందించిందో తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. మరి సందీప్ మొదలు పెట్టిన సాయం.. కంటిన్యూ అవుతుందా.. టాలీవుడ్ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.
Read Also : Rajini Kanth : రజినీకాంత్ తో వివాదంపై స్పందించిన సత్యరాజ్
