RGV: సీఎం వైఎస్ జగన్ నిజ జీవిత ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్జీవీ సినిమా అంటే వివాదం లేకుండా అయితే రిలీజ్ అయిన దాఖలాలు లేవు. ఇక ఈ సినిమా కూడా వివాదాల మధ్యనే రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనే డైలమాలో ఉంది. నారా లోకేష్ వ్యూహం సినిమాను ఆపేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. అయినా కూడా వర్మ ఎక్కడ తగ్గడంలేదు. ఒకప్పక తన లాయర్లు పోరాడుతున్నారని తెలుపుతూ.. విజయవాడలో వ్యూహం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది.
ఇక ఈ ఈవెంట్ లో వర్మ మాట్లాడుతూ.. “చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు మాత్రమే..ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇపుడు ఆయనే గొప్ప అని చెప్పటానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమే. చంద్రబాబు, లోకేష్ నిత్యం చేసేది జగన్ ను తిట్టడమే. అలాంటి లోకేష్ తమని తిడుతున్నామని పిటిషన్ వేయటం జోక్ గా ఉంది. ఇక పవన్ విషయానికొస్తే.. అతనొక ఓ రంగుల రాజా.. ఊరు పేరు తెలియని బర్రెలక్క పోటీ చేసి ఫేమస్ అయ్యింది. పవన్ ఓ బర్రెలక్క.. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నాడు. ఒకప్పుడు పవన్ అంటే నాకు ఇష్టం ఉండేది. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది.లోకేష్ ఎక్కడ గెలవలేదు
చంద్రబాబు కొడుకు కాకుండా చూస్తే లోకేష్ నథింగ్. లోకేష్ ది ఎర్ర బుక్కా…ఎర్రి బుక్కా. ఈ సినిమా ద్వారా కొందరు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిత్వం బట్టలు ఊడదీస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.