కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేచురల్ నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్ అందించారు. ఇటీవల విడుదలైన సిరివెన్నెల నివాళి పాట ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఇటీవలే టీజర్ విడుదల కాగా సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు రాహుల్ ఆ రూమర్లపై స్పందించారు.
Read Also : ‘మా’ భవనంపై మరో వారంలో ప్రకటిస్తా – మంచు విష్ణు
తాజా ఇంటర్వ్యూలో రాహుల్ “శ్యామ్ సింగ రాయ్” గురించి అనేక కీలక వివరాలను వెల్లడించారు. ఈ చిత్రంలో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ ఉందని జరుగుతున్న ప్రచారం గురించి క్లారిటీ ఇచ్చారు. కథ, దాని పాత్రలు ఆధ్యాత్మిక టచ్ కలిగి ఉన్నాయని, ఈ చిత్రం పీరియాడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని రాహుల్ అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ “శ్యామ్ సింగ రాయ్” ఒక పురాణ ప్రేమకథ అని, ఇందులో ప్రధాన నటుల పాత్రలు ప్రత్యేకంగా ఉన్నాయని, సినిమా కథ రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుందని, ఒకటి ప్రస్తుత కాలంలో, మరొకటి 1960లలో అంటూ కథ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. రాహుల్ ఊహించిన ప్రపంచాన్ని సృష్టించడంలో VFX, ప్రొడక్షన్ డిజైన్ కీలక పాత్ర పోషించనున్నాయి.