దర్శకుడు మారుతి ‘పక్కా కమర్షియల్’ తో రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన రాశి ఖన్నా నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో వెబ్ సిరీస్ పై ఫోకస్ చేశాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ను హీరోగా ఓ చిన్న సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడిగా మారుతికి ఇదే తొలి ఓటీటీ సినిమా. అయితే ‘ఆహా’ నుంచి వస్తున్న ఈ వెబ్ సిరీస్ కి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసేలా ప్లాన్ చేశాడట మారుతి.