యంగ్ డైరెక్టర్ మారుతి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం మారుతి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంతకుముందు “మహానుభావుడు”, “ప్రతిరోజు పండగే” విజయం అందుకున్న ఆయన అదే జోష్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని మారుతి తెలిపారు.
Read Also : “సలార్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే ?
మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ ఫిర్జాదా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కథ చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. ఈ సినిమా కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మారుతి అతి తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది పెద్ద హీరోలతో సినిమాలు ఉన్నాయని, బిగ్ ప్రాజెక్ట్స్ కు దర్శకత్వం వహించబోతున్నారు అని మారుతి తెలిపారు.