Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు. ఆ కథతోనే సాయిదుర్గాతేజ్ తో మూవీ తీయాలనుకున్నాడు. కానీ అది వేరే డైరెక్టర్ వంశీకి ఇచ్చేశాడు మారుతి. ఇప్పుడు సాయి కోసం మరో పవర్ ఫుల్ కథను రాసుకున్నాడంట. ఆ కథను కూడా వంశీకే ఇస్తున్నాడు. వంశీ డైరెక్షన్ లో సాయిదుర్గాతేజ్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ ను మారుతి నిర్మిస్తున్నారంట.
Read Also : Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
మారుతి బ్యానర్ లోనే ఈ సినిమాను తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షన కూడా మారుతి చేయనున్నట్టు తెలుస్తోంది. సాయితేజ్ కు మారుతితో మంచి అనుబంధం ఉంది. పైగా మారుతిపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాకు సాయితేజ్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రటకన వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయితేజ్ ప్రస్తుతం సంబరాట ఏటిగట్టు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆ సినిమా అయిపోగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నాడు సాయితేజ్. ఆ సినిమా తర్వాత మారుతి సినిమాను అనౌన్స్ చేయబోతున్నారంట.
Read Also : JR NTR – Vijay Devarakonda : జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లకు వాటితో భారీ దెబ్బ..!
