Yatra 2: సినిమాలో వైయస్సార్ మరణానికి కారణాలు లేవు.. ఎవ్వరినీ కించపరచలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Mahi V Raghav Comments on Yatra 2 Movie: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించగా మంగళవారం నాడు ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో మహి వీ రాఘవ్ మాట్లాడుతూ ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదని, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదన్నారు. ఈ టీజర్, ట్రైలర్లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయట ప్రజలకు తెలియదని ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశానని అన్నారు. ట్రైలర్లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నది సినిమా ఉద్దేశమన్నారు ఆయన.
Director Vassishta: విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఇంట ఆనంద హేల
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చని అయితే వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్ర చూపించామని అన్నారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుందన్నారు. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదన్న ఆయన సినిమాలో ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదన్నారు. నిజానిజాలు జనాలకు తెలుసని, ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదని అన్నారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి, ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయని అన్నారు. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయన్న ఆయన ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుందని అన్నారు. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేమన్నారు. మమ్ముట్టి చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్ మాత్రం నిజం’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!