Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా గురించి ప్రస్తావించారు ఒక మీడియా ప్రతినిధి.
Read Also : Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో క్రిష్ ఆసక్తికరంగా స్పందించారూ ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా ఒక జర్నీ. హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించారు. నాకు పవన్ కళ్యాణ్ ళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. రత్నం గారంటే నాకు అమితమైన గౌరవం. చిన్నప్పుడే ఆయన సూర్య మూవీస్ పోస్టర్ చూసి ఎప్పటికైనా ఈయనతో సినిమా చేయాలని అనుకున్నాను. సినిమా మొదలు పెట్టాక కోవిడ్ సహా కొన్ని షెడ్యూలింగ్ కారణాల వలన నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా పర్సనల్ ఇష్యూస్ కోసం నేను తప్పుకోవాల్సి వచ్చింది. నా తర్వాత జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే నేను ఆ సినిమా నుంచి వచ్చాక పూర్తిగా ఘాటీ మీద ఫోకస్ పెట్టీ పని చేశాను అని చెప్పుకొచ్చారు.
Read Also : Mahesh Babu : ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మహేశ్ బాబు ఎమోషనల్
