దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నారట. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో కలిసి పవన్ సినిమా నిర్మాతలతో “ఆచార్య” రిలీజ్ విషయం ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారం చూస్తుంటే “ఆచార్య” సంక్రాంతికి రాబోతోందా ? అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక నిజమైతే “భీమ్లా నాయక్” పోస్ట్ పోనే కావడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయం గందరగోళంగా మారింది. “ఆర్ఆర్ఆర్” సినిమా తేదీపై మరోసారి అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ విషయం ఎటూ తేలదు. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ ఆలస్యం కావచ్చంటూ జరుగుతున్న ప్రచారం కారణంగా ఇటీవల రిలీజ్ డేట్లు ప్రకటించిన సినిమాల్లో కొన్ని వాయిదా పడతాయని అంటున్నారు. ఇప్పుడు ఆ టాక్ కు తగ్గట్టుగానే కొరటాల “భీమ్లా నాయక్” నిర్మాతలకు కలుస్తున్న విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also : జాన్వీ స్టైల్ లో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ !
“ఆర్ఆర్ఆర్” షూటింగ్ ముగించుకుని వచ్చాక సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని, ఒకవేళ “ఆర్ఆర్ఆర్” వాయిదా పడితే అక్టోబర్ 13న “ఆచార్య” వస్తాడని అనుకున్నారు. మరి తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే “ఆర్ఆర్ఆర్” చెప్పిన సమయానికే వస్తుందేమో అనిపిస్తోంది. అందుకే “ఆచార్య” కోసం కొరటాల “భీమ్లా నాయక్” నిర్మాతలతో చర్చలు సాగించడానికి సిద్ధమైనట్టున్నాడు. మొదటి నుంచీ “ఆచార్య” విడుదల విషయం గందరగోళంగానే ఉంది. ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ 10 అన్నారు. తరువాత దసరా, ఆ తరువాత అక్టోబర్ 13 లేదా జనవరి 8… ఇలా సినిమా రిలీజ్ డేట్ విషయానికి సంబంధించి రోజుకో వార్త వస్తోంది. కొరటాల, “భీమ్లా నాయక్” నిర్మాతల భేటీ తరువాతైనా “ఆచార్య” రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.