Breaking : ‘కళాతపస్వి’ కే.విశ్వనాథ్ ఇక లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివి నుంచి మరో తార భువికి వెళ్ళిపోయింది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ రోజు (గురువారం రాత్రి) తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు.
కళాతపస్వి కే. విశ్వనాధ్ తెరకెక్కించిన శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సప్తపది, సిరివెన్నెల వంటి గొప్ప సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. అలానే నటుడిగా కూడా అనేక సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించారు కె విశ్వనాధ్. ఇక వారి అకాల మరణం నిజంగా తెలుగు చిత్ర సీమకు తీరని లోటు అనే చెప్పాలి. విశ్వనాధ్ గారి అకాల మరణం విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా రేపు ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్ధం ఇంటివద్దనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి... ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
— Jr NTR (@tarak9999) February 2, 2023
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు..తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend 🙏🙏🙏 pic.twitter.com/qFBQ2376ji
— Gopichandh Malineni (@megopichand) February 2, 2023
Anjali 🌺 tradition,warmth,heart,music,dance,love …..your movies filled my childhood with humaneness and wonder! #ripkviswanathji 🌹🌺🌹🌺🍵 pic.twitter.com/HivlTfUFe3
— A.R.Rahman (@arrahman) February 2, 2023
తెలుగుదనానికి ఆత్మ ,గౌరవం 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/m7FQoyamox
— bhaskarabhatla (@bhaskarabhatla) February 2, 2023
Deeply saddened by the demise of Sri K Viswanath Garu.
Had the privilege of being directed by him in Swathikiranam. My thoughts and prayers with his loved ones. pic.twitter.com/6ElhuSh53e
— Mammootty (@mammukka) February 2, 2023
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి