MaheshBabu : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కితే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంకోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఓ రూమర్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. మహేశ్ బాబుతో బుచ్చిబాబు సాన ఓ భారీ మూవీ చేస్తున్నాడంట. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించగా మహేశ్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే ఛాన్స్ ఉందా అనే డౌట్లు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే రాజమౌళితో సినిమా కంప్లీట్ కావడానికి ఎంతలేదన్నా ఇంకో రెండేళ్లు పడుతుంది.
Read Also : Deepika Padukone : పిల్లల విషయంలో రణ్‌వీర్ చాలా సాపోర్ట్ చేశాడు..
అటు బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీ కూడా ఇంకో ఏడాది టైమ్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు బుచ్చిబాబు తీసింది ఒక్క సినిమానే. ఇప్పుడు రెండోది తీస్తున్నాడు. దాని రిజల్ట్ ఇంకా తెలియదు. రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది అందులో డౌట్ లేదు. మహేశ్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా పేరు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి అప్పుడు మహేశ్ మరింత పెద్ద డైరెక్టర్లతో మూవీ చేయాలని చూస్తాడు. అంతే గానీ బుచ్చిబాబుతో చేస్తాడా అంటే అనుమానమే. పైగా పెద్ది మూవీ ఏ మాత్రం తేడా కొట్టినా మహేశ్ తో మూవీ అనుమానమే. పెద్ది రిజల్ట్ తెలియకుండా బుచ్చిబాబుకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదు. మహేశ్ తో మూవీ కోసం బడా డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. కాబట్టి బుచ్చిబాబుతో మూవీ అంటే కొంత అనుమానమే.
Read Also : Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం