NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించేందుకు ఎంపికయ్యారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా NBK107 సెట్లో మరో స్టార్ డైరెక్టర్ సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Michael : పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తాజాగా “అఖండ”తో బాలయ్యకు రోరింగ్ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను NBK107 సెట్స్‌ని సందర్శించి, టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. మేకర్స్ పవర్ ఫుల్ త్రయానికి సంబంధించిన పిక్ ను పంచుకోగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
