NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించేందుకు ఎంపికయ్యారు.…