Alphonse: నన్ను విమర్శించే హక్కు కమల్ కి మాత్రమే ఉంది… సెన్సేషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక హిట్ సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు అంతకన్నా ఎక్కువగానే విమర్శిస్తారు. డబ్బులు పెట్టి సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఏ ఒక్కరి మీద ప్రేమ ఉండదు, సినిమాపైన మాత్రమే ఉంటుంది. అందుకే సినిమాని బాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు మనల్ని మైండ్ లో పెట్టుకుంటారు లేదా మర్చిపోతారు. ఈ విషయాన్ని మర్చిపోయి, హిట్ సినిమా తీసినప్పుడు చూశారు ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ప్రేక్షకులని విమర్శించడం తప్పు. ఈ విషయం తెలియని దర్శకుడు ఆల్ఫనోస్ పుత్రన్… “నా సినిమాలని, నన్నూ విమర్శించే హక్కు కేవలం కమల్ హాసన్ కి మాత్రమే ఉంది. మీ అందరికీ నన్ను కామెంట్ చేసే హక్కు లేదు” అంటూ ఘాటుగా స్పందించాడు. ఆల్ఫనోస్ పుత్రన్ అనే పేరు వినగానే ఆయన ఎవరో తెలియక పోవచ్చు కానీ మలయాళ ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అంటే మాత్రం అందరికీ తెలుసు.
మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రేమమ్’ సినిమాకి ఆల్ఫనోస్ పుత్రన్ దర్శకుడు. ఈ మూవీతో స్టార్ దర్శకుడి హోదా వచ్చినా వెంటనే సినిమా చెయ్యకుండా చాలా కాలం పాటు వెయిట్ చేసిన ఆల్ఫనోస్ పుత్రన్, ఇటివలే ‘గోల్డ్’ అనే సినిమా చేశాడు. నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. దీంతో ఎన్నో అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యి, ఆల్ఫనోస్ పుత్రన్ పై నెగటివ్ కామెంట్స్ చేశారు. దీన్ని స్పోర్టివ్ గా తీసుకోని, ఇంకో మంచి సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం మానేసి ఆల్ఫనోస్ పుత్రన్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కమల్ కి మాత్రమే తన సినిమాని విమర్శించే హక్కు ఉంది అంటే కమల్ కి మాత్రమే నీ సినిమా చూపించుకో అంటూ సినీ అభిమానులు కౌంటర్స్ వేస్తున్నారు. హిట్, ఫ్లాప్ ని సమానంగా తీసుకోవడం ఆల్ఫనోస్ పుత్రన్ నేర్చుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారు.
Also Read
- Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!