Sithara Entertainments : చందు మొండేటి డైరెక్షన్ లో ‘వాయుపుత్ర’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వాయుపుత్ర. మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి కథ.
Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్..
Also Read
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
- Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
- Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
- Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
చరిత్ర, భక్తి భావంతో భారీస్థాయిలో 3D యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘వాయుపుత్ర’, హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్.. ఈ సినిమా అందించాలనుకుంటున్న ఇతిహాస స్థాయి మరియు ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యం. మునుపెన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంలో ముంచేయడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. ‘వాయుపుత్ర’ ఒక సినిమాటిక్ మైలురాయిగా మరియు విశ్వాసం, శౌర్యం, విధి యొక్క వేడుకగా మారనుంది. డైరెక్టర్ చందూ మొండేటి విజన్, నిర్మాతగా నాగవంశీ గ్రాండియర్ ఈ ‘వాయుపుత్ర’ భారతీయ సినిమాని పునర్నిర్వచించటానికి రెడీ అవుతోంది. హృదయపూర్వక కథనాన్ని అద్భుతమైన 3D యానిమేషన్ విజువల్స్‌తో మిళితం చేసి, మన అత్యంత గౌరవనీయమైన సాంస్కృతిక చిహ్నాలలో ఒకటైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనుంది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!